AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవితకు మళ్లీ నిరాశే.. బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
బీఆర్‌ఎస్‌ పార్టీకి మళ్లీ బిగ్‌ షాక్‌.. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 27న జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసులో సీబీఐ కౌంటర్‌ దాఖలు చేయగా.. ఈడీ కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. గురువారంలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇచ్చింది.

ఈడీ అభ్యర్థన మేరకు..
లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. తనకు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కవిత బెయిల్‌ కు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఈడీ చేయలేదు. తమకు కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరగా.. ఈడీ అభ్యర్థన మేరకు కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది సుప్రీం కోర్టు. గురువారంలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో దిగాలు..
ఇటీవల లిక్కర్‌ స్కామ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా మంగళవారం కవిత బెయిల్‌ పిటిషన్‌ పై సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న తరుణంలో కవితకు ఖచ్చితంగా బెయిల్‌ వస్తుందని బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు కార్యకర్తలు ఆశతో ఉన్నారు. తాజాగా సుప్రీం కోర్టు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణను వాయిదా వేయడంతో మరోసారి కవిత బెయిల్‌ పై ఉత్కంఠ నెలకొంది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్‌ చేసింది. దాదాపు ఐదు నెలలుగా కవిత జైలులోనే ఉన్నారు. పలు మార్లు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేయగా అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. మరి కవిత బెయిల్‌ పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.

ANN TOP 10