AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రొఫెసర్ కోదండరాంకు రాఖీ కట్టిన ఆత్రం సుగుణ

వెన్నెలంత చల్లనిది ఈ పండుగ అన్న ఎమ్మెల్సీ

అమ్మన్యూస్, హైదరాబాద్ : రక్షా బంధన్‌ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ రాఖీ కట్టారు. హైదరాబాద్ లోని కోదండరాం నివాసానికి వెళ్లిన సుగుణక్క ఆయనకు రాఖీ కట్టి మిఠాయి తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

సోదరి సుగుణక్కతో నా అనుబంధం రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సుగుణక్కతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా కోదండరాం పేర్కొన్నారు.

ANN TOP 10