AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు రాత్రి హస్తినకు సీఎం.. రెండు, మూడు రోజులు అక్కడే!

కాంగ్రెస్‌ హైకమాండ్‌తో భేటీ అయ్యే అవకాశం
మరోవైపు యాపిల్‌ కంపెనీ ప్రతినిధులతోనూ సమావేశం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రుణమాఫీ ఫైనల్‌ విడత ప్రారంభించిన అనంతరం రాత్రి హస్తినకు బయలుదేరుతారు. అయితే, సీఎం రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఫాక్స్‌కాన్‌ యాపిల్‌ కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి శ్రీధరాబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. మరోవైపు శుక్రవారం కాంగ్రెస్‌ హైకమాండ్‌తో రేవంత్‌ భేటీ కానున్నారు.

రైతులకు రుణమాఫీ ఆగస్టు 15తో పూర్తి చేయడంతో.. వరంగల్‌లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానించనున్నారు. అదేవిధంగా సచివాలయం ఎదురుగా రాజీవ్‌ గాంధీ విగ్రహం ఓపెనింగ్‌ కార్యక్రమానికి రేవంత్‌ సోనియాను ఆహ్వానించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ నూతన పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టులపై ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ANN TOP 10