ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటన రద్దు అయ్యింది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజ్‌లోని గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన జన జాతర బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి సాయంత్రం ఒక్కసారి భారీ వర్షం కురిసింది. అక్కడ వీచిన గాలికి టెంట్లు అన్ని కుప్పకూలిపోయాయి. కుర్చీలు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. భారీ వర్షం కురుస్తుండడంతో జన జాతర సభ రద్దైంది. ఇక సాయంత్రం వరంగల్‌లో రోడ్ షోలో పాల్గొననున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రోడ్డు మార్గం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మొదట వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రోడ్ షో లో పాల్గొంటారు. అనంతరం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా రోడ్ షో జరగనుంది.









