AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ ఎన్నికల్లో బీజేపీని బొంద పెట్టాలి.. భట్టి విక్రమార్క ధ్వజం

ఈ ఎన్నికల్లో బీజేపీని బొంద పెట్టాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ దేశానికి బీజేపీ అత్యంత ప్రమాదకరమని మండిపడ్డారు. రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్ర జరుగుతోందని, రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ 400 సీట్లు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర చేస్తోందన్నారు. రిజర్వేషన్ల ద్వారానే ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు వచ్చాయని చెప్పారు. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు ఎత్తివేస్తారా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేస్తూ వచ్చారని, కానీ బీజేపీ మార్చాలని కుట్ర చేస్తోందన్నారు. దేశ సంపద, వనరులు, అధికారం కొంత మంది చేతుల్లో నలిగిపోతుందన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ బొందపెట్టాలని కోరారు. హక్కులు కాపాడుకోవాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలన్నారు. బీజేపీకి ఓటు వేస్తే భవిష్యత్తు లేకుండా పోతుందన్నారు. ఆ పార్టీ హయాంలో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం పోరాటం చేస్తున్నట్లు ఆర్‌ఎస్ఎస్ నటిస్తోందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని, రాష్ట్రంలో కులగణన జరుగుతోందని చెప్పారు. ఈ మాట రాహుల్ గాంధీ కూడా చెప్పారని విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు.

ANN TOP 10