AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సూర్య కుమార్ యాదవ్ రికార్డుల మోత

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్ ఘనవిజయం సాధించింది. సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో 174 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు సునాయాసంగా ఛేదించింది. 51 బంతుల్లో 102 పరుగులు బాదిన సూర్య ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించాడు. స‌న్‌రైజ‌ర్స్ పై శ‌త‌కంతో చెల‌రేగ‌డం ద్వారా సూర్య‌కుమార్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ముంబై ఇండియ‌న్స్ త‌రుపున అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి సూర్య‌కుమార్ యాద‌వ్ నిలిచాడు. వీరిద్ద‌రు ముంబై త‌రుపున చెరో రెండు శ‌త‌కాలు బాదారు. ఈ జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్, స‌న‌త్ జ‌య‌సూర్య‌, సైమ‌న్స్‌, కామెరూన్ గ్రీన్ త‌దిత‌రులు ఉన్నారు. అలాగే లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు బాదిన ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. సన్‌రైజర్స్ పై సూర్య కుమార్ యాదవ్ 102 పరుగులు కొట్టగా.. 114 పరుగులతో సనత్ జయసూర్య తొలి స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో లెండిల్ సిమన్స్, కామెరాన్ గ్రీన్‌లు సూర్య తర్వాత ప్లేస్‌లో ఉన్నారు.

ANN TOP 10