కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ
‘అమ్మన్యూస్’తో ముఖాముఖి
(అమ్మన్యూస్, ఆదిలాబాద్):
‘ప్రజాసేవ కోసమే టీచర్ ఉద్యోగాన్ని కాదని రాజకీయాల్లోకి వచ్చాను. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆదిలాబాద్ ఇంకా అభివృద్ధి చెందలేదు. పేదల కష్టాలు ఎవరికీ పట్టడంలేదు. వారి బతుకులు చూసి చలించే రాజకీయాల్లోకి వచ్చా’నని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తనను కలిసిన ‘అమ్మన్యూస్’ ప్రతినిధితో అనేక విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
మొన్నటి వరకు ఉపాధ్యాయురాలిగా నా విధులు తరగతి కేంద్రంగా సాగేది. సమాజ ప్రగతి అనేది స్వప్నంగా కనిపించేది. అందుకే రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆదిలాబాద్ ప్రగతికి నిరంతరం కృషి చేస్తా. పదేళ్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజక వర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఆచరణాత్మకమైన అభివృద్ధిని చేసి చూపిస్తాను.
ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ప్రజా సమస్యలపై అవగాహన ఉంది. ఎంపీగా గెలిచాక ప్రజా సమస్యలపై చట్టసభల్లో వినిపిస్తా. పరిష్కరించటాని కృషి చేస్తాను. ముఖ్యంగా ప్రజలను తప్పుదోవ పట్టించే నైజం కాదు. పారదర్శంగా పని చేయాలనేది మా అభి మతం అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకోవడం ముఖ్యం.
సాధించి తీరుతా..
ఆదిలాబాద్– ఆర్మూర్ రైల్వేలైన్ సాధించితీరుతాను. అలాగే సిమెంటు పరిశ్రమను తెరిపించటం, కేరళ రాష్ట్రం మాదిరిగా గల్ఫ్ వెళ్లేవారికి ప్రత్యేక విధానం అమలుచేయటం, బీడీ కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం పని చేయటం, వాళ్ళు కోరుకుంటే స్వయం ఉపాధి చూపించటం, అన్ని గ్రామాలకు తాగు నీరు సరఫరా చేయటం వంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తాను.
ఆదివాసి మహిళల అభ్యున్నతికి కృషి
వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించాలని, కోట్లకు పడగలెత్తాలనే ఆలోచన నాది కాదు. ఉట్నూరులో మాకంటూ ఉన్న ఓ ఇల్లు ఉంది. ఇప్పటికీ ఆదివాసీ, గిరిజన, మైదాన ప్రాంతాల్లో రక్త హీనతతో బాధపడుతున్న మహిళ లను చూస్తుంటే గుండె తరుక్కు పోతోంది. వైద్యం అందక బాలిం తలు చనిపోయారని, ఉప్పొంగిన వాగులతో సకాలంలో ఆస్పత్రికి రాలేక కడుపులోనే పిండం చనిపోయిందని విన్నప్పుడు తల్లడిల్లిపోయేదాన్ని. సాటి మహిశగా వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. మహిళలు అను కుంటే ఏ రంగంలోనైనా రాణించగలరు. సహనం, గుండె ధైర్యం కావాలి. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లోని మహిళలకు అండగా ఉంటా. ఎంపీగా గెలిచాక తప్పకుండా. విశ్వవిద్యాలయం తీసుకొస్తా మహిళల అక్షరాస్యతను పెంచేలా కృషి చేస్తా. బాలికల చదువులు మధ్యలో ఆగకుండా చూస్తాను. ఉమ్మడి జిల్లా ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేస్తాను. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క సహకారంతో ముందుకెళ్తాను. మీ బిడ్డగా భావించి వచ్చే ఎంపీ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలి.









