మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ పోటీలోనే లేదని, అభ్యర్థి కాంగ్రెస్ వాళ్లకే తెలియదన్నారు. ఇంకా జనమేం గుర్తుపడుతారని ఎద్దేవా చేశారు. సోవారం కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా సిరిసిల్లలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. బీజేపీ వాళ్లు పచ్చి లంగలు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవుడి పేరు చెప్పి మోసం చేయడం తప్ప రూపాయి అభివృద్ధి చేయరన్నారు. అక్షింతలు, రాముడు అనగానే బీజేపీ ట్రాప్‌లో పడొద్దన్నారు. బండి సంజయ్‌వి గాలి మాటలు, గాలి పనులు తప్ప ఐదేళ్లలో కరీంనగర్‌కు ఏం చేయలేదని విమర్శించారు.నేత కార్మికుల కోసం 3 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసుకొని కార్మికులను కాపాడుకున్నామని చెప్పారు. 5 ఏళ్లలో ఒక్క రూపాయి మందు పంచ లేదన్నారు. మీరు తనకు ఇచ్చిన దయ రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్ల నే అన్నారు. సిరిసిల్ల పట్టణం అతి సుందరంగా తీర్చి దిద్దుకున్నామన్నారు. మీరు నన్ను ఇక్కడా గెలిపించిన కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందని కామెంట్స్ చేశారు. మోచేతికి బెల్లం పెట్టి మోసపూరిత హామీలతో గెలిచిందని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలో ఒక్కటి అమలు చేసి మోగొల్లకు మహిళకు తకులాట పెట్టిందన్నారు. ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా చెప్పండి? అని ప్రశ్నించారు.
*కిషన్ రెడ్డి, బండికి సవాల్..*
అబద్ధాలు చెబితే డిజిటల్ ప్రపంచంలో ఒక్క నిమిషాల్లో దొరికిపోయారని వ్యాఖ్యానించారు. అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పోయాకా అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు, భుతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 100 రోజుల్లో రైతు రుణమాఫీ, ఫించన్లు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఓట్లు చేసుకునేటప్పుడు ఒక లెక్క ఓట్లు వేయించుకున్నాకా ఒక లెక్క ఉంది కాంగ్రెస్ పార్టీ తీరన్నారు. నమో అంటే నరేంద్ర మోడీ కాదు, నమ్మించి మోసం చేయడం అన్నారు. నల్లధనం తెచ్చిండా, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? అని ప్రశ్నించారు. బుల్లెట్ ట్రైన్ అన్నాడు.. మాములు రైలుకే దిక్కులేదన్నారు కేటీఆర్. సిరిసిల్ల నేతన్నల కోసం మోడీని పది సార్లు సాయం అడిగితే.. పది పైసల సాయం కూడా చేయలేదన్నారు. 30 లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరి నుంచి దోచుకుని తన దోస్తులైన అదానీ, అంబానీలకు అప్పులు మాఫీ చేశారన్నారు. ఇది నిజం కాదని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నిరూపిస్తే.. రేపే సిరిసిల్ల కొత్త బస్టాండ్ దగ్గర తన రాజీనామా లేఖ పెడతానంటూ మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.









