AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా

ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియామకం అయ్యారు. ఈ మేరకు సోమవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌ కుమార్‌ గుప్తాను ఏపీ కొత్త డీజీపీగా ఎంపిక చేయగా.. ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. ప్రస్తుతం హోం శాఖ సెక్రటరీగా ఉన్నారు ఆయన. అయితే ఇదివరకు డీజీపీగా కొనసాగిన రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆదివారం బదిలీ వేటు పడింది. ఈసీ తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపగా.. వారి పేర్లను ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు.అయితే కొత్త డీజీపీ రేసులో ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, అంజనా సిన్హా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఈ క్రమంలోనే హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ANN TOP 10