AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపే ఖమ్మంలో వెంకీ రోడ్‌షో.. పొలిటికల్‌ ఎంట్రీకి సర్వంసిద్దం

కాంగ్రెస్‌ అబ్యర్థి రఘురామిరెడ్డి తరఫున ప్రచారం

(అమ్మన్యూస్‌, ఖమ్మం):
నటుడు వెంకటేశ్‌ (వెంకి మామ) మంగళవారం ఖమ్మంలో పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన హీరోగానే కాకుండా పొలిటికల్‌ లీడర్‌ ను అవతారమెత్తబోతున్నారు. ఈ క్రమంలోనే రేపు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డి తరఫున రోడ్‌ షోలో సందడి చేయనున్నారు. కాగా, హీరో వెంకటేశ్‌ రఘురామిరెడ్డికి స్వయాన వియ్యంకుడు. దీంతో మామ గెలుపు కోసం ఇప్పటికే వెంకీ కూతురు ఆశ్రితా జోరుగా ప్రచారం చేస్తోంది. ప్రతి గ్రామానికి వెళ్లి గడగడపకూ తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇన్నాళ్లు రాజకీయాలకు వెంకీ దూరంగానే ఉంటూ వస్తున్నారు. గతంలో ఆయన ఏ పార్టీ తరఫున ప్రచారంలోనూ పాల్గొన్న దాఖలు లేవు అయితే, రేపు తొలిసారి ఖమ్మంలో వియ్యంకుడి తరఫున ప్రచారంలో పాల్గొనబోతుండటంతో వెంకీ ఏం. చెబుతారు.. ఎలాంటి అంశాలపై మాట్లాడతారని విషయంపై సస్పెన్స్‌ నెలకొంది.

ఇదిలా ఉంటే.. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌ ఆయన. చక్కని టైమింగ్‌, సున్నితమైన హాస్యంతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న నటుడు. ప్రస్తుతం ఆయన సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు చేస్తూ యంగ్‌ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఓ సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్నారు.

ANN TOP 10