AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని కేంద్రం కీలక పదవిలో నియమించింది. త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 18) రాత్రి రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. త్రిపురతో పాటు ఒడిశా రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను నియమించారు. ఒడిశా గవర్నర్‌గా జార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్‌ దాస్‌‌ను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇంద్రసేనారెడ్డికి సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సూర్యాపేట జిల్లాకు చెందిన నల్లు ఇంద్రసేనా రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో మలక్‌పేట స్థానం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2022లో తెలంగాణ బీజేపీ చేరికలు, సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఒడిశా గవర్నర్‌గా నియమితులైన రఘుబర్‌ దాస్‌.. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన 2014 నుంచి 2019 వరకు జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు.

ANN TOP 10