మంత్రి కేటీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ బస్సుయాత్ర… తుస్సుమనడం ఖాయం అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు. నిస్సిగ్గు మాటలకు, ఎదురుదాడులకు కేరాఫ్ అడ్రస్ డ్రామారావు అంటూ వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోడీ – కేడీ అని.. కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ – కేడీ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ – కేడీ అని అన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయించలేని దద్దమ్మలం అని తమరే ఒప్పుకుంటున్నారని.. తెలంగాణకు ఈ దద్దమ్మ పాలన ఇక అవసరం లేదు అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.









