తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్.. ములుగు సభలో ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణకు చేరుకున్న రాహుల్, ప్రియాంక ములుగు జిల్లాలో తొలి ఎన్నికల శంఖారావ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ముందుగా పాల్గొన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకం కింద ప్రతీ ఆడబిడ్డకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామంటూ హామీ గుప్పించారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు అమలు కావాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో అధికారంలోకి వచ్చాము. అదే ఊపుతో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేసారు.
ఇక ములుగు సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ పలు ప్రజాకర్షక హామీలను గుప్పించింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇద్దరు ఒక్కటే అని చెప్పారు. ఇది బీఆర్ఎస్.. బీజేపీ రిష్తేదార్ సమితి అంటూ దుయ్యబట్టారు. మూల్యం చెల్లించుకోవాల్సిన వచ్చినా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల ఇచ్చిన హామిలను నెరవేర్చడానికి గ్యారంటీ కార్ట్ ఇస్తున్నాము. పెరిగిన గ్యాస్, చమురు ధరతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.









