ప్రజాసేవా భవన్‌లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు
ఆదిలాబాద్ః వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జోగు రామన్నను చిత్తుచిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలని, 15 ఏళ్లుగా ఆయన ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రజాసేవా భవన్‌లో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని తర్నం గ్రామస్తులతోపాటు రూరల్ మండలం పరిధిలోని చిచ్‌ధరి ఖానాపూర్, పట్టణంలోని కెఆర్‌కే కాలనీ, దుర్గానగర్, ఇందిరానగర్, డాల్డా కంపెనీ కాలనీవాసులు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతామని, అందరికీ న్యాయం చేసే దిశగా పథకాలను రూపొందిస్తామని అన్నారు. జోగు రామన్న ను ఓడించాలంటే కేవలం 40 రోజులే ఉన్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. అవినీతి, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరితే వెనకడుగు వేశాడని ఎద్దేవా చేశారు.

పాయల శంకర్, జోగు రామన్న ఇద్దరు దొంగలేనని, శరీరాలు వేరైనా వారివురి ఆత్మ ఒక్కటేనన్నారు. వారిని నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దని హితవు పలికారు. అర్హులైనవారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, దళితబంధు ఎందరికి ఇచ్చారని ప్రశ్నించారు. బీసీలకు ,మైనార్టీలకు ఆర్థికసాయం అందిందా అంటూ నిలదీశారు. నవంబర్ 30న జోగు రామన్నకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ పేదల పార్టీ అన్నారు. గతంలో ఎందరోమందికి ఇండ్లు కట్టించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆరు గ్యారంటీ హామీలను పక్కాగా అమలు చేస్తామని భరోసా కల్పించారు. అందరూ చేతిగుర్తుకే ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఐనేని సంతోష్‌రావు, సయ్యద్ సుజాత్ అలీ, MA షకీల్, ఆదివాసీ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షెడ్మకి ఆనంద్ రావు, నాగర్కర్ శంకర్, కొండూరి రవి, మానే శంకర్, రాజ్ మహమ్మద్, పెందూర్ ప్రభాకర్, యెల్టీ సన్నీరెడ్డి, శ్రీరామ్,షేక్ మన్సూర్, బూర్ల శంకర్, అన్నెల శంకర్, సమీ ఉల్లాఖాన్, రమేష్, జంగిలి ప్రవీణ్, మహమూద్, MA ముఖీమ్, అంజద్ ఖాన్, కర్మ,రహీమ్ ఖాన్, అస్బాత్ ఖాన్, యాసం రాము, మజర్‌మైఉద్దీన్, మారుతీ, వసంత్ పవార్, సంజీవ్ రెడ్డి, పోతారాజు సంతోష్, ఆశారెడ్డి, సుభాష్‌రెడ్డి, గంగారాం తదితరులు పాల్గొన్నారు.









