AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కమలనాథుల కసరత్తు పూర్తి… రేపే తొలి జాబితా వెల్లడి

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో తొలి జాబితాపై కమలనాథులు కసరత్తు పూర్తి చేశారు. ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు సార్లు చర్చించారు. అక్టోబర్ 16న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. అదే రోజున బీజేపీ తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 35 నుంచి 40 మంది అభ్యర్థులతో తొలి జాబితాను సిద్ధం చేసింది. అభ్యర్థుల బలాబలాలు, సామాజిక సమీకరణాలు ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.తొలి జాబితాలో ముఖ్య నేతల పేర్లు ఉండకపోవచ్చనే సమాచారం. గజ్వేల్, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

కిషన్ రెడ్డి, బండి సంజయ్, విజయశాంతి, లక్ష్మణ్ పోటీపై క్లారిటీ లేదు. పోటీపై కిషన్ రెడ్డి, బండి సంజయ్, విజయశాంతి, లక్ష్మణ్ ఊగిలలాటలో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నుంచి రఘునందన్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వబోతుంది. ఆయన నియోజకవర్గాలు మారుతున్నారు, వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే కొంత చర్చ జరిగినా చివరికి ఆయన దుబ్బాక నుంచి పోటీ చేయాలనుకున్నారు. దీంతో రఘునందన్ రావుకు దుబ్బాక నుంచి పోటీ చేసే బీజేపీ ఇచ్చినట్లు సమాచారం.

హుజూరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ అక్కడ పోటీ చేయడంతోపాటు ఉమ్మడి జిల్లా గజ్వేల్ లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించి పార్టీ నుంచి కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. హూజూరాబాద్, గజ్వేల్ రెండు చోట్ల ఈటల రాజేందర్ బరిలో దిగబోతున్నారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కు పోటీగా బీజేపీ తరపున ఈటల బరిలోకి దిగుతున్నారు.

ANN TOP 10