AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

51 మందికే బీఆర్ఎస్ బీఫామ్స్.. మిగతా అభ్యర్థుల్లో టెన్షన్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ 51 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు తెలంగాణ భవన్‌లో బీఫామ్స్ అందించారు. మిగతా అభ్యర్థులకు రేపు ఇస్తానన్నారు. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి టెక్నికల్, న్యాయ పరమైన సమస్యల వల్ల ఇవాళ 51 మందికే బీఫామ్స్ ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. కానీ.. తెరవెనక మరో కోణం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్‌కి 6 సెంటిమెంట్ గా ఉంది. అందువల్లే ఆయన అక్టోబర్ 15వ తేదీన (1+5=6)… 51 (5+1=6) మందికే బీ ఫామ్స్ ఇచ్చారని తెలుస్తోంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున కేసీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత బీఫాం అందుకున్నారు.

బీఫామ్స్ పొందని అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది అభ్యర్థులను మార్చుతున్నట్లు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని భావిస్తున్న అభ్యర్థులు.. తమకు బీఫామ్ వస్తుందా రాదా అనే టెన్షన్‌లో ఉన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్ని వారు రకరకాలుగా విశ్లేషించుకుంటున్నారు. తమకు ఇస్తారో, ఇవ్వరో అనే టెన్షన్ వారిలోని చాలా మందిలో కనిపిస్తోందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

కేసీఆర్ ఏం చెప్పారు?
“మళ్లీ విజయం మనదే, ఎవరూ తొందరపడవద్దు అంటూ బీఆర్ఎస్ అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు సీఎం కేసీఆర్. అభ్యర్థులకు తెలంగాణ భవన్‌లో బీఫామ్‌లు ఇచ్చేందుకు వచ్చిన కేసీఆర్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “మనల్ని గెలవలేక కుయుక్తులు పన్నుతున్నారు, కోపతాపాలను అభ్యర్థులు పక్కన పెట్టాలి. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు జరిగింది. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో సీటు మార్పు జరిగింది” అని తెలిపారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్న కేసీఆర్.. బీ ఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులు.. భరత్ నంబర్ 98480 23175కి కాల్ చేసి.. న్యాయపరమైన అనుమానాలు ఏవైనా ఉంటే నివృత్తి చేసుకోవచ్చు అన్నారు.

ANN TOP 10