AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ దళపతి.. ఇదిగో ప్రచార రథం..

తెలంగాణలో ఎన్నికల సమరం షురూ అయ్యింది. గులాబీ దళపతి కేసీఆర్.. నేడు ప్రచార పర్వం ప్రారంభించనున్నారు. తాను సెంటిమెంట్‌గా భావిస్తున్న హుస్నాబాద్ నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. దాదాపు 3 వారాల పాటు అనారోగ్యంతో బాధపడిన సీఎం కేసీఆర్.. ఇవాళ్టి నుంచి జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు.

ఎన్నికల ప్రచారం నేపథ్యంలో గులాబీ దళపతి కేసీఆర్ ప్రచార రథం సిద్ధమైంది. ఈ ప్రచార రథానికి సంబంధించి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఈ ప్రచార రథం. అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ ప్రచార రథాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బహుమతిగా ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణాకు చేరింది ఈ బస్సు.

6 / 6

ANN TOP 10