AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జనగామలో పల్లాని గెలిపించాలి: కేటీఆర్‌

జనగామ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య ఆయన సయోధ్య కుదిర్చారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్‌ కేటాయించామని.. ఆయన్ను గెలిపించాలని జనగామ నేతలకు కేటీఆర్‌ కోరారు.జనగామ టికెట్‌ విషయంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య పోటీ ఏర్పడింది. ఈసారి ముత్తిరెడ్డి స్థానంలో పల్లాకు టికెట్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ముత్తిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్‌ పదవికి కేటాయించారు.

ANN TOP 10