నవంబరులో జరుగబోయేది ఎమ్మెల్యే ఎన్నికలు కాదని, ఇవి రాష్ట్ర తలరాత మార్చే ఎన్నికలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) వ్యాఖ్యానించారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయితే మన పార్టీకి జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. ఇవి మన ఖ్యాతి పెంచి ఢిల్లీని శాసించే ఎన్నికలని అన్నారు. ఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌కు అచ్చొచ్చిన సంఖ్య ఆరు.. నవంబరు 30 ఎన్నిక… డిసెంబరు 3న ఫలితాలు రెండింటిలో మూడు ఉంది.. రెండు కలిపి కేసీఆర్‌కు అచ్చొచ్చిన సంఖ్య 6.. మరోసారి సీఎం కేసీఆర్ సర్కారే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక, రాకముందు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉందో ప్రజలు విశ్లేషణ చేసుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ 24గంటల ఉచిత కరెంట్ ఇస్తుంటే.. ఓ కాంగ్రెస్ ఎంపీ ఎక్కడా లేదంటూ మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు వచ్చి విద్యుత్ వైర్లు పట్టుకోవాలని సూచించారు.









