AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ కార్యాలయంలో బీజేవైఎం నేతల భేటీ

బీజేపీ కార్యాలయంలో బీజేవైఎం నేతలు(BJYM Leaders) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు, ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల్లో సరైన ప్రాధాన్యం ఇవ్వాలని యువమోర్చా నేతలు అధిష్ఠానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈనెల 12వ తేదీన తెలంగాణకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య రానున్నారు. తేజస్వీ సూర్య తెలంగాణ పర్యటన నేపథ్యంలో సన్నాహక సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో టికెట్ల కేటాయింపులో యువమోర్చాకు ప్రాధాన్యత ఇవ్వాలని తేజస్వీ సూర్యను కోరాలని నిర్ణయం తీసుకున్నారు. యువమోర్చాకు కనీసం పది టికెట్లు అయిన ఇవ్వాలని నేతలు కోరుతున్నారు.

యువమోర్చా అధ్యక్షుడు భానుప్రకాష్ మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రాజేంద్రనగర్ టికెట్ ఆశిస్తున్నారు. మోహన్ నాయక్ – వైరా టికెట్, మేడ్చల్ – పవన్‌రెడ్డి, బెల్లంపల్లి – వెంకటకృష్ట, జనగామ – సురేష్ టికెట్లను ఆశిస్తున్నారు. టీఎస్పీఎస్సీ అంశంలో నిరుద్యోగుల పక్షాన పోరాడామని బీజేవైఎం నేతలు చెబుతున్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాడి కేసులు పెట్టించుకున్న తమకు టికెట్ల కేటాయింపులో సమ ప్రాధాన్యత ఇవ్వాలని బీజేవైఎం అధిష్ఠానంపై వత్తిడి తెస్తుంది. ఇదే విషయాన్ని కూడా తేజస్వీ సూర్య దగ్గరకు తీసుకెళ్తామని యువమోర్చా నేతలు పేర్కొన్నారు.

ANN TOP 10