AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న సీఎం కేసీఆర్‌ సతీమణి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ధ్వజ స్థంభానికి మొక్కులు చెల్లించుకుని.. తోమాలాసేవలో ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి శోభ తలనీలాలను కూడా సమర్పించుకున్నారు. శ్రీవారి సేవ అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. టీటీడీ అధికారులు స్వామివారి చిత్ర పటాన్ని బహుకరించారు.

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శోభ అక్కడి నుంచి శ్రీకాళహస్తి బయలుదేరి వెళ్లారు. శ్రీకాళహస్తిలోనూ శోభ ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని, వచ్చే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్న కోరికతోనే ఆమె తిరుమలకు వచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు. సోమవారం రాత్రే తిరుమలకు చేరుకున్న కేసీఆర్ సతీమణికి ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

ANN TOP 10