AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో సీఐడీ విచారణకు నారా లోకేశ్‌..

అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు నారా లోకేష్‌. ఐఆర్‌ఆర్‌ కేసులో అక్రమాలు జరిగాయంటూ 2022లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ 14గా ఉన్నారు లోకేష్‌. సాయంత్రం 5 గంటల వరకు.. లోకేష్‌ను న్యాయవాది సమక్షంలో విచారించనున్నారు అధికారులు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌ను ఏ-14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న లోకేష్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ నోటీసులిచ్చింది.

అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు హాజరైయ్యారు నారా లోకేష్‌. ఐఆర్‌ఆర్‌ కేసులో అక్రమాలు జరిగాయంటూ 2022లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ 14గా ఉన్నారు లోకేష్‌. సాయంత్రం 5 గంటల వరకు.. లోకేష్‌ను న్యాయవాది సమక్షంలో విచారించనున్నారు అధికారులు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌ను ఏ-14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న లోకేష్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ నోటీసులిచ్చింది. ఈనెల 4న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులిచ్చింది. నోటీసులో హెరిటేజ్ బోర్డ్ తీర్మానాలు, అకౌంట్ బుక్స్ తీసుకువాలని సూచించింది. అయితే ఈ నోటీసులపై హైకోర్ట్‌ను ఆశ్రయించారు లోకేష్‌. దీంతో హెరిటేజ్ తీర్మానాలు, అకౌంట్స్ బుక్స్ కి సంబంధించి ఎలాంటి ఒత్తిడి చేయొద్దని హైకోర్ట్‌.. సీఐడీకి ఆదేశాలిచ్చింది.

ANN TOP 10