కంది శ్రీనివాస రెడ్డి సేవాగుణం పై ప్రశంసల వర్షం
ఆదిలాబాద్: కంది శ్రీనివాసరెడ్డి సామాజిక సేవలో దూసుకుపోతున్నారు. ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మంచి స్పందన కన్పిస్తోంది. తన సేవాకార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. జనం ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. ప్రజల మనిషిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా మహిళలను తోబుట్టువులా భావించి ఓ అన్నలాగా వారికి ప్రెషర్ కుక్కర్లు అందిస్తున్నారు. ఈ పంపిణీ తో ఆడబిడ్డల కళ్లల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఇప్పటికే నిత్యాన్న దానం , ఆంబులెన్స్, తాగునీరు, పెళ్లికానుకలు,నిత్యావసర సరుకులు లాంటి ఎన్నోసేవా కార్యక్రమాలు చేపట్టిన కంది శ్రీనివాస రెడ్డి మహిళలను తన తోబుట్టువులుగా భావించి ఒక అన్నగా చిరుకానులు అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అనేక కాలనీల్లో పంపిణీ కార్యక్రమాలు జరిగాయి.

తాజాగా ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 22,23 తాటిగూడ కాలనీ, 17వ వార్డు ఖుర్షీద్ నగర్ కాలనీలలో నిర్వహించిన పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కాలనీవాసులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులుస్వాగతం పలికారు. పూలబొకేలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కాలనీలోని మహిళలకు కుక్కర్లను అందజేసారు. ప్రెషర్ కుక్కర్ల ప్రాధాన్యతను కాలనీవాసులకు వివరించారు. పౌష్టికాహారం అందించడం కోసమే వీటిని ఇస్తున్నానని, ప్రతిఒక్కరూ వీటిలో ఆహారం వండుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. కానీ ఎమ్మెల్యే జోగు రామన్న తనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నాడని అన్నారు. మహిళలే ఆయనకు తగినరీతిలో బుద్ధిచెబుతారని చెప్పారు. ఎన్నికుట్రలు పన్నినా తన సంకల్పాన్ని ఆపలేరని, ప్రజల నుంచి తనను దూరం చేయాలని అన్నారు. ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా అనుకున్న పనిని సాధించి తీరుతానని, ప్రజలకు కుక్కర్లు అందిస్తానని స్పష్టం చేశారు.









