హాట్ అందాల భామ ఈషా రెబ్బా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతోంది ఈషా రెబ్బా. రోజా విరబూసినట్లు ఉండే ఆమె చిరునవ్వు కుర్రాళ్ల హృదయాలకు చిల్లులు పెడుతోంది. ఈమె తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈషా వెండితెరకు పరిచయమై దాదాపు పుష్కరం కావొస్తోంది. మంచి ఆరంభం లభించినా స్టార్ కావడానికి అవసరమైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం ఆమె తమిళ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. రెండు తమిళ చిత్రాలతో పాటు.. ఓ తెలుగు మూవీలో నటిస్తోంది ఈషా.









