AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజేంద్రనగర్‌లో భారీ కొండచిలువ

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ హసన్‌నగర్‌లో భారీ కొండచిలువ కలకలం రేపింది. లారీ పార్కింగ్ వద్ద శబ్దం రావడంతో లారీ డ్రైవర్లు చుట్టుపక్కల వెతకగా.. భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. 20 ఫీట్ల పొడవు ఉన్న భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. వన్యప్రాణులు అడవులను వదలి జనవాసాల మధ్యకు చేరుకుంటుండంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొండ చిలువ ప్రత్యక్షంపై పోలీసులకు, ఆటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. చివరకు స్థానికులే కొండచిలువను పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. 20 ఫీట్లు ఉన్న భారీ కొండచిలువను చూసి పోలీసులు, స్థానికులు కంగుతిన్నారు.

ANN TOP 10