AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేనెందుకు సిగ్గు పడాలి?.. యాంకర్ రష్మీ షాకింగ్ పోస్ట్

టీవీ యాంకర్, సినీ నటి రష్మీ గౌతమ్ గురించి ప్రతిఒక్కరికీ తెలుసు. ఓ వైపు ప్రొఫెషన్ కొనసాగిస్తూనే మరోవైపు సామాజికంగా తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఈ లేడీ. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ పలు సందర్భాల్లో సమాజ పరిస్థితులపై రియాక్ట్ అవుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ ఓల్డ్ వీడియో ఒకటి షేర్ చేసి.. కొందరికి టార్గెట్ అయింది యాంకర్ రష్మీ.

కొన్ని రోజులుగా సనాతన ధర్మంపై జనాల్లో విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయమై కోలీవుడ్ హీరో, డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గతంలో సనాతన ధర్మం గొప్పతనం చెబుతూ మాట్లాడిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇదే వీడియోను యాంకర్ రష్మీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెపై ఒక్కసారిగా ట్రోలింగ్ షురూ అయింది. అయితే ఈ పరిస్థితిపై రియాక్ట్ అవుతూ ఫైరింగ్ కామెంట్స్ చేసింది రష్మీ. మతాలపై కామెంట్స్ చేస్తూ ఓ నోట్ షేర్ చేసింది.

నేనెందుకు సిగ్గు పడాలి? మీరు దేవుళ్లను ఎందుకు నమ్మరని ఎప్పుడైనా నేను అడిగానా? అలాంటప్పుడు నేను దేవుణ్ణి నమ్మితే మీరెందుకు ప్రశ్నిస్తున్నారు? అంటూ ఫైర్ అయింది రష్మీ. ప్రతీ మతానికి కొన్ని నియమాలుంటాయి. ఎవరి బతుకు వారిని బతకనివ్వండి.. నా దేవుళ్లని, నమ్మకాలను ధూషించకండి అంటూ పెద్ద క్లాస్ పీకింది యాంకర్ రష్మీ. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది.

ANN TOP 10