AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రైవేట్ బస్సు బోల్తా.. ఐదుగురికి గాయాలు..

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ప్రమాదవశాత్తు ప్రయివేట్ బస్సు బోల్తా పడింది. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ప్రమాదవశాత్తు కేవీఆర్ ట్రావెల్స్ బస్సు ఫల్టీ కొట్టింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 37మంది ప్రయాణీకులుఉన్నారు. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హైవే రహదారికి అడ్డు లేకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ANN TOP 10