AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి. ఈ నెల 4న రెండు సెషన్లల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1,80,226 మంది హాజరయ్యారు.ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల కాగా, ఆదివారం ముందు ఫైనల్‌ కీని విడుదల చేసిన ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్‌ను ఐఐటీ గువాహటి నిర్వహించగా, సీట్ల భర్తీని ఆ సంస్థే చేపడుతున్నది. ఫలితా ల కోసం https:// jeeadv.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ANN TOP 10