AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కిడ్నాప్‌కు గురైన రియల్టర్ కుమారుడు సేఫ్

నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడిని గుర్తు తెలియని దుండుగులు కిడ్నాప్ చేశారు. బాలుడు హర్షవర్ధన్ తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. డైరెక్టుగా రంగంలోకి దిగిన నార్త్‌జోన్ డీసీపీ చందనా దీప్తి.. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌ను వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. హర్షవర్ధన్ ఆచూకీ కోసం నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేశారు. కిడ్నాప్ చేసిన దుండగుల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధాహరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసిన అధికారులు బాలుడి వివరాలు పంపించారు. ఈ నేపథ్యంలోనే బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా కొండకండ్ల మండలం రామన్నగూడెం వద్ద బాలుడిని సేవ్ చేశారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరిలించారు. అయితే ఎందుకు కిడ్నాప్ చేసారు. ఎవరు కిడ్నాప్ చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10