AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏసీబీ వలలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ

తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా ఏసీబీ వలలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB Officials) రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత వారమే ఆయనపైన ఆరోపణలు రావడంతో ఏసీబీ టీమ్ నేరుగా యూనివర్శిటీకి వెళ్ళి ఆయన ఛాంబర్‌లో సోదాలు నిర్వహించింది. ఆ తనిఖీల్లో ఏ వివరాలు దొరికాయన్నది గోప్యంగానే ఉంచారు.

ఈ క్రమంలో శనివారం ఉదయం హైదరాబాద్ నివాసంలో వీసీ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. నియామకాల విషయంలో అవతవకలకు పాల్పడ్డారని, నిధుల దుర్వినియోగం కూడా జరిగిందనేది ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్‌కు చిక్కడంతో ఆయన హయాంలో వర్శిటీలో జరిగిన గోల్‌మాల్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10