AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల ఇళ్లపై ముగిసిన ఐటీ సోదాలు

హైదరాబాద్: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి నివాసాలపై ఐటి సోదాలు ముగిశాయి. గత బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఐటీ సోదాలు ప్రారంభంకాగా శనివారం అర్ధరాత్రి 2 గంటలకు ముగిశాయి. ఐటీ అధికారులు మూడు రోజులపాటు సోదాలు చేపట్టారు. అర్ధరాత్రి రెండు గంటలకు ఎమ్మెల్యేల ఇంటి నుంచి ఐటీ అధికారుల బృందం వెళ్లిపోయింది. మూడు రోజులపాటు జరిపిన సోదాల్లో పలు డాక్యుమెంట్లను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. బ్యాంకు లాకర్స్ కంపెనీ లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లపై ఐటీ ఆరా తీసింది. సోదాల అనంతరం ఐటీ అధికారులు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.

ANN TOP 10