AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భారీ చోరీ.. వందే భారత్ ట్రైన్ ఎక్కుతుండగా..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భారీ చోరీ కలకలం రేపుతోంది. ఓ వృద్ధురాలు రైలు ఎక్కుతున్న సమయంలో దొంగ చోరీకి పాల్పడ్డాడు. హడావుడిగా వందే భారత్ ట్రైన్ ఎక్కుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి హ్యాండ్ బ్యాగ్ చోరీ చేసి పరార్ అయ్యాడు. చోరీకి గురైన బ్యాగ్‌లో రూ.60 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ ఉన్నట్లు వృద్ధురాలు చెబుతోంది. హ్యాండ్ బ్యాంగ్ చోరీ అయినట్లు గుర్తించిన మహిళ.. వెంటనే సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వృద్దురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఇందుకోసం రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ చోరీకి గురి కావడంతో మహిళ బలోదిబోమంటోంది.

ANN TOP 10