AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎయిర్ ఫోర్స్ సేవలు అద్భుతం

కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది..రాష్ట్రపతి
నగర పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్‌లో పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పెరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గ్రాడ్యుయేట్స్‌ను ఉద్దేశించి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు.

ధైర్యవంతులు అయిన క్యాడెట్లను కన్న తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని తెలిపారు. టర్కీలో జరిగిన భూకంపంలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పనిచేసిందని కొనియాడారు. కోవిడ్ లోనూ చాలా అద్భుతంగా పనిచేసిందన్నారు. సవాళ్ళను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఏప్రిల్‌లో సుఖాయ్ జెట్‌లో ప్రయణించినట్లు తెలిపారు. ఇది తనకు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ఫైటర్ జెట్ ఫైలెట్లులో మహిళలు కూడా అధికంగా ఉండటం సంతోషదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

ANN TOP 10