తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది. కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో పార్టీ అప్రమత్తమైంది. అందులో భాగంగా ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర పార్టీపై ప్రత్యేక దృష్టి సారించిన అగ్రనేతలు దాదాపు పది గంటల పాటు సుదీర్ఘంగా
చర్చించినట్లు సమాచారం.
అసంతృప్తులకు ప్రాధాన్యం పై పార్టీ అగ్రనేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో నడ్డ, అమిత్ షాతో పాటు సంతోష్ జీ, సునిల్ బన్సల్, సావదాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అమిత్ షా రాష్ట్ర పర్యటనకు ముందే ప్రకటన విలువడే అవకాశం ఉందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. వివిధ పార్టీల్లోని అసంతృప్తులను బీజేపీలో చేర్చుకునే విషయంపై కూడా చర్చించారు. పొంగులేటితో మరోసారి భేటీకి ప్రయత్నించాలని నిర్ణయించారు. త్వరలోనే పార్టీ ముఖ్యలతో జాతీయ నేతలు సమావేశం జరుపనున్నారు.









