AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో రాష్ట్రానికి మరో వందే భారత్ ట్రైన్

హైదరాబాద్‌కు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కేటాయించేందుకు రైల్వేశాఖ సమాయత్తమవుతోంది. సికింద్రాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు ఈ ట్రైన్ నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు నగరాల మధ్య సాధారణంగానే ట్రాఫిక్ ఉంటుంది. వాణిజ్యం పరంగా కూడా చాలా మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. సికింద్రాబాద్ – నాగపూర్ మధ్య 580 కిలోమీటర్ల దూరం ఉండగా.. ప్రస్తుతం 25కు పైగా ట్రైన్లు రెండు సిటీల మధ్య పరుగులు పెడుతున్నాయి. అయితే శతాబ్ది , రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో లేకపోవటంతో ప్రస్తుతం ప్రయాణ సమయం 10 గంటలకు పైగా పడుతోంది.
ఏపీ మీదుగా మరో వందేభారత్

ఈ నేపథ్యంలో వందే భారత్‌ ట్రైన్ అందుబాటులోకి వస్తే 6 గంటల్లోనే ప్రయాణికులు తమ గమ్య స్థానానికి చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. రామగుండం స్టేషన్‌లో ఈ ట్రైన్ ఆగనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్గాల మధ్య వందే భారత్‌ను ట్రైన్ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. అయితే ఏ స్టేషన్‌లోనూ వందేభారత్‌ రైలును ఆపకుండా ట్రయల్‌ రన్‌ను పూర్తి చేశారు. త్వరలో ఈ రైలు రాకపోకల షెడ్యూల్‌ను కూడా అధికారికంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించనున్నారు. దేశవ్యాప్తంగా 18 ట్రైన్లు ఇప్పటికే రాకపోకలు సాగిస్తుండగా.. ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తే 19వ వందే భారత్ కానుంది.

ANN TOP 10