AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైలు ప్రమాద మృతదేహాల అప్పగింతలో తీవ్ర జాప్యం

– డీఎన్‌ఏ పరీక్షలంటూ కాలయాపన
– శవాగారాల వద్ద బంధువుల పడిగాపులు
ఒడిశాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం జరిగి ఐదు రోజులు దాటింది. కేంద్రం, రైల్వే మంత్రిత్వ శాఖ ఆఘమేఘాల మీద ప్రమాదస్థలి పునరుద్ధరణ పనులు చేపట్టి, ఆ మార్గంలో రైలు ప్రయాణాన్ని అనుమతించింది. దుర్ఘటన ఆనవాళ్లన్నింటినీ తుడిచేసి, ఈ ప్రమాదంలో తమ అసమర్థత ఏమీ లేదని చెప్పే ప్రయత్నాన్ని కేంద్రం కొనసాగించింది. కానీ బాలాసోర్‌ ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ఇంకా సమస్యగానే మిగిలివుంది. ఆనవాళ్లు గుర్తుపట్టకుండా మారిపోయిన మృతదేహాలను గుర్తించడంలో బంధువులు, కుటుంబసభ్యులు గందరగోళానికి గురవుతున్నారు. మృతదేహం తమవారిదంటే…కాదు తమ వారిదంటూ వాదనలు జరుగుతున్నాయి. దీనితో డీఎన్‌ఏ పరీక్షలు చేసి మృతదేహాలు అప్పగిస్తామంటూ పోలీసులు ప్రకటించారు. ఫలితంగా మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యమవుతున్నది. మృతదేహాల కోసం వచ్చిన వారు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి.

బాలాసోర్‌ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువుల రాకతో వివిధ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఆ శవం మా వాడిదేనని ఒకరంటే కాదు…కాదు మా బంధువుది అంటూ మరొకరు ముందుకు వస్తున్నారు. ఇలా ఒక మృతదేహం కోసం పలువురు పోటీ పడుతుండడంతో ఏం చేయాలో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిజనిర్ధారణ కోసం వారు బంధువుల డీఎన్‌ఏ నమూనాలు సేకరించే పనిలో పడ్డారు. ఒకే మృతదేహం కోసం పలువురు పోటీ పడుతున్న సందర్భాలు కన్పిస్తున్నాయని ఆయన చెప్పారు. డీఎన్‌ఏ పరీక్షలు జరిపేందుకు ఎయిమ్స్‌లో ఓ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటికే 20 మంది నుండి నమూనాలు సేకరించారు. ఇదిలావుండగా మృతుల సంఖ్యను రైల్వే శాఖ సవరించింది. తొలుత 288 మంది చనిపోయారని ప్రకటించి ఇప్పుడు ఆ సంఖ్యను 275గా చూపుతోంది.

ANN TOP 10