AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవిత ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా

రాకేష్ రెడ్డి బీజేపీలో చేరి వచ్చిన సందర్భంగా ఆర్మూర్‌లో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితపై కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేసినా తాను ఓడించి తీరుతానని వ్యాఖ్యానించారు. కవిత నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఓడించే బాధ్యత తనదేనని తెలిపారు. ఆమెను ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వబోమని చెప్పారు.

‘అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఏడు నియోజక వర్గాల్లో తిరుగుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్‌లో కవిత ఎక్కడ పోటీ చేసినా ఒడిస్తాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్న కవితను తరిమి కొడతాం.. 100 కార్లలో ఆర్మూర్‌కు బీజేపీ శ్రేణులు వస్తుంటే ఆపే ప్రయత్నం చేశారు. కానీ 300 కార్లలో కాషాయ శ్రేణులు వచ్చి ఆర్మూర్ ఎమ్మెల్యేపై దండయాత్ర చేశారు. రాజకీయ మార్పు ఆర్మూర్ గడ్డ నుంచి మొదలవుతుంది. కేసీఆర్ కూతురు కవితను ఓడించిన గడ్డ ఇదే’ అని అర్వింద్ వ్యాఖ్యానించారు.

ANN TOP 10