AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ దేశంలో రతి క్రీడ.. !

రతి క్రీడను క్రీడగా గుర్తించిన స్వీడెన్
జూన్‌లో తొలి సెక్స్ ఛాంపియన్‌షిప్
యూరొపియన్ దేశాల్లో ఒకటైన స్వీడెన్ జూన్ నెలలో తొలిసారి ‘సెక్స్ ఛాంపియన్‌షిప్’ నిర్వహించబోతున్నది. ఆరు వారాలపాటు జరిగే ఈ పోటీ జూన్ 8న గోథెన్‌బర్గ్‌లో నిర్వహించనున్నారు. స్వీడిష్ సెక్స్ సమాఖ్య మార్గదర్వకత్వంలో ఈ పోటీ జరుగనున్నది. వివిధ మీడియా నివేదికల ప్రకారం ఈవెంట్‌లో పాల్గొనేవారు లోబరుచుకోవడం(సెడక్షన్), శరీర మర్దనం(బాడీ మసాజ్), ఫోర్‌ప్లే తదితరములతో సహా 16 విభాగాలలో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటారు.

వివిధ దేశాలకు చెందిన 20 మంది పాల్గొనే అవకాశం ఉన్న ఈ పోటీలో ప్రతి రోజు ఆరు గంటల సెషన్‌లు ఉంటాయి. ఒక్కో జంటకు 45 నుంచి 60 నిమిషాలు కేటాయిస్తారు. ఈ పోటీకి ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ కూడా ఉంటుంది. వారు ప్రేక్షకులతో కలిసి విజేతలను నిర్ణయిస్తారు. ఈ పోటీలు వివిధ సెక్సువల్ ఓరియెంటేషన్‌ను ప్రోత్సాహిస్తాయి.

‘క్రీడా వ్యూహాల్లో భాగంగా లైంగిక ధోరణిని(సెక్సువల్ ఓరియెంటేషన్) చేర్చడం ఐరోపా దేశాలలో సంచలనాత్మక అభివృద్ధి కాగలదు’ అని స్వీడిష్ ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ అధిపతి డ్రాగన్ బ్రాటిచ్ పేర్కొన్నట్లు వార్త. ఈ పోటీ జరుగుతుందా లేదా అనేది ఇప్పటికీ ధృవీకరించబడలేదు!

ANN TOP 10