AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబు మాయలో అమిత్ షా పడరు: కేఏ పాల్

టీడీపీ అధినేత చంద్రబాబు హస్తిన పర్యటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు కురిపించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఓ డ్రామాగా కొట్టిపారేశారు. అమిత్ షా తనను పిలిచారంటూ మీడియా, ఐటీ సెల్ ద్వారా రూ.కోట్లు ఖర్చు పెట్టి బాబు ప్రచారం చేయించుకుంటున్నారని ఆరోపించారు. తాను అమిత్ షాతో మాట్లాడానని, చంద్రబాబు మాయలో ఆయన పడరని పాల్ తెలిపారు. చంద్రబాబు గురించి తెలియనివారు ఎవరూ లేరని, కొంతమంది ఎన్‌ఆర్‌ఐలకు తప్ప అందరికీ తెలుసన్నారు.

2018లో మోదీని చంద్రబాబు ఘోరంగా తిట్టారని, అమిత్ షాను గోబ్యాక్ అని అన్నారని పాల్ గుర్తు చేశారు. ఇప్పుడేమో మోదీ గొప్ప ప్రధాని అంటూ ఆయనకు బాబు మసాజ్ చేస్తున్నారని పాల్ విమర్శించారు. మోదీ, అమిత్ షా చంద్రబాబు మాయలో పడి మోసపోరని, బాబు మాయలో పడి పవన్ కల్యాణ్ ఒక్కరే మోసపోతున్నారని అన్నారు. పవన్‌కు ప్యాకేజీతో పాటు 15 సీట్లు, బీజేపీకి 25 సీట్లు ఇస్తానన్న బాబు ప్రతిపాదనను అమిత్ షా తిరస్కరించారని పాల్ తెలిపారు.

తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని అమిత్ షాతో పాటు బండి సంజయ్ చెప్పారని పాల్ గుర్తు చేశారు. లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కల్యాణ్ సహకరించవద్దని, వారాహి యాత్రను ఆపేసి ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. జనసైనికులు, కాపులు, బీసీలు ప్రజాశాంతి పార్టీలో చేరాలని, పవన్ కల్యాణ్‌కు తమ పార్టీ నుంచే మంచి పోస్ట్ ఇద్దామని పాల్ తెలిపారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా టీడీపీ భూస్థాపితం అయిందన్నారు.

ఇటీవల ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ కావడంతో టీడీపీ-బీజేపీ పొత్తుపై ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణలో కొన్నిచోట్ల టీడీపీకి ఓటు బ్యాంక్ ఉండటంత ో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సిద్దమవుతుందనే ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది.

ANN TOP 10