AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరోసారి ట్రెండింగ్‌లో మంత్రి మల్లారెడ్డి

పోలీసులను పోలీస్ స్పెల్లింగ్ అడిగిన మంత్రి
సోషల్ మీడియాలో వీడియో వైరల్
మంత్రి చామకూర మల్లారెడ్డి తెలంగాణ రాజకీయాల్లో చాలా ఫేమస్. ‘పాలమ్మినా.. పూలమ్మినా.. బోర్‌వెల్ నడిపినా.. కష్టపడ్డా.. పైకి వచ్చినా..’ అంటూ ఆయన చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెడింగ్. ఆయన ఏ మీటింగ్‌లో మాట్లాడినా.. ఎక్కడున్నా.. తనదైన పంచ్ డైలాగులు, టైమింగ్‌తో అందర్ని నవ్విస్తూ ఉంటారు.

తాజాగా… ఆయన మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. నిన్న (సోమవారం) మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలోని జీనోమ్ వ్యాలీలో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడి రిజిస్టర్ బుక్‌లో పోలీస్ ఓపెనింగ్‌కు సంబంధించిన వివరాలు రాయాలని పోలీసులు సూచించారు. పెన్ను తీసుకున్న మంత్రి మల్లన్న.. ఏం రాయాలని అడిగారు. ఇవాళ డేట్ వేసి పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ అని రాయాల్సిందిగా.. పోలీసులు సూచించారు.

అయితే పోలీస్ స్పెల్లింగ్ ఏంటని అక్కడే ఉన్న పోలీసులను మంత్రి అడిగారు. అది విన్న పోలీసులు, ప్రజాప్రతినిధులు కంగుతిన్నారు. ఎప్పుడు సరదాగా ఉండే మల్లారెడ్డి.. హాస్యానికి అడుగుతున్నారా ? లేక తమను పరీక్షించడానికి అడుగుతున్నారా ? తెలియక తికమకపడ్డారు. వెంటనే తేరుకొని స్పెల్లింగ్ చెప్పారు. ప్రస్తుం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్రానికి మంత్రిగా ఉండి పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ రాకపోవటం అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మంత్రి పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల పరిస్థితి ఎంటో అని కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల పోలీసుల బొర్రల (పొట్ట)పై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ANN TOP 10