AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహాప్రభో.. నాకు పెళ్లాం కావాలి.. ప్రభుత్వాధికారికి ఓ వ్యక్తి లెటర్

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో
ప్రతి ఒక్కరూ తమ విలువైన సమయాన్ని సోషల్ మీడియా పేజీని స్క్రోల్ చేస్తూ గడిపేస్తున్నారు. ఇలా స్క్రోలింగ్ చేస్తున్న సమయంలో చాలా సార్లు ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. కొన్ని సార్లు ఆ విచిత్ర ఘటనలు కనులముందుకు వస్తాయి కూడా.. అప్పుడు అవి నమ్మడం కష్టం అవుతుంది కూడా. అంతేకాదు ఆ సంఘటలు కనిపిస్తుంటే.. కొన్ని సార్లు నవ్వుని తెప్పిస్తాయి. నవ్వును నియంత్రించుకోవడం కష్టం. ప్రస్తుతం ఒక ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇప్పుడు తెరపైకి వచ్చిన లేఖ వెరీ వెరీ స్పెషల్. ఈ ఉత్తరం నిజంగా విచిత్రం.. ఓ వ్యక్తి తనకు భార్య కావాలంటూ.. అది కూడా ఇలాంటి లక్షణాలున్న భార్య కావాలంటూ ఒక వ్యక్తి లేఖ రాశాడు. ఆ లెటర్ ను రాజస్థాన్ సీఎం సహాయ శిబిరానికి పంపించాడు. నివేదిక ప్రకారం ఈ లేఖ దుబ్బి గంగద్వాడి నుంచి ముఖ్యమంత్రి సహాయ శిబిరానికి చేరుకుంది. ఒక వ్యక్తి తహసీల్దార్‌కు దరఖాస్తును అందజేసి తనకు ఎలాంటి భార్య కావాలో తెలిపాడు.

తన ఇంట్లో అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని.. అందుకనే తాను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయినట్లు పేర్కొన్నాడు. కనుక దయ చేసి తన పెళ్లికి సహాయం చేసి.. వీలైనంత త్వరగా తన ఇంటికి ఒక ఇల్లాలిని అందించండి మహాప్రభో అని వినతి చేశాడు.

ANN TOP 10