AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌ గూటికి జూపల్లి, పొంగులేటి !

బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరికకు ఆపార్టీ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో హైకమాండ్‌ చర్చలు జరిపింది. కాంగ్రెస్‌ అగ్రనేతల సమక్షంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే అభిమానులకు ఆ ఇద్దరు నేతలు సంకేతాలిచ్చారు.

కాగా ఈనెల 12న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రియాంక , రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. ఈనెల 20వ తేదీ లేదా 25న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రాహుల్‌ అమెరికా పర్యటన తర్వాత ఖమ్మం సభపై నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

ANN TOP 10