AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైలు ప్రమాదంలో కుట్ర కోణం ఉండొచ్చు.. దీదీ సంచలన వ్యాఖ్యలు

ఒడిశా రైలు ప్రమాదంపై పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో కుట్ర కోణం ఉండొచ్చని అనుమానించిన ఆమె.. ప్రమాదంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు బెంగాల్ రూ.5 లక్షల ఆర్ధిక సాయం
రైలు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి బెంగాల్ ప్రభుత్వ తరఫున రూ.5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఒడిశా ప్రభుత్వం, రైల్వే శాఖ చేపట్టిన సహాయక చర్యలు పూర్తయ్యే వరకూ తమ సహకారం కొనసాగుతుందని ఆమె హామీ ఇచ్చారు.

ANN TOP 10