AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వాతావరణ శాఖ చల్లటి కబురు.. రాబోయే నాలుగు రోజులు వర్షాలు…

విపరీతమైన ఎండ, ఉక్కపోతతో సతమతం అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. దాంతో, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మరోవైపు ఈ రోజు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

ANN TOP 10