AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు.. కర్ఫ్యూ విధింపు!

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా మారుతున్న వేళ.. మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మెయితీ, కుకీ వర్గాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలను అదుపు చేసేందుుకు మరోసారి ఆర్మీ, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. రాజధాని ఇంఫాల్‌లోని న్యూ చెకాన్ ప్రాంతంలో ఉన్న లోకల్ మార్కెట్ స్థలం విషయంలో తాజాగా వివాదం చెలరేగింది.

దీంతో ఇరు వర్గాలు మరోసారి బాహాబాహీకి దిగాయి. ఆందోళనకారులు పలు ఇళ్లకు నిప్పంటించాయి. విషయం తెలుసుకున్న అధికారులు.. భద్రతా బలగాలను భారీగా మోహరించాయి. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా కర్ఫ్యూ విధించారు. అంతకుముందు సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూను సడలించగా.. దాన్ని రద్దు చేశారు.

అసలు సమస్యేంటి
మణిపూర్‌లోని ఇంఫాల్ లోయ ప్రాంతంలో రాష్ట్రంలో 10 శాతం భూభాగంలో 90 శాతం మంది ప్రజలు నివసిస్తారు. ఇక్కడ మెయితీ వర్గం వారు అత్యధికంగా నివసిస్తారు. రాష్ట్రంలోని 60 మంది ఎమ్మెల్యేల్లో 40 సీట్లు అక్కడి నుంచే ఉండటంతో రాజకీయంగానూ వారికి బలమైన పట్టు ఉంటుంది. ఇక మిగిలిన కొండ ప్రాంతాల్లో కుకీ, నాగాతోపాటు 30 రకాల ఆదివాసీ తెగలున్నాయి. మెయితీలకు కొండ ప్రాంతాల్లో భూములు కొనేందుకు అనుమతి లేదు. కానీ కొండ ప్రాంతాల్లో ఉన్న వారు లోయలో భూములు కొనడానికి అనుమతి ఇచ్చారు. మెయితీలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుండగా.. వారికి ఇవ్వొద్దని గిరిజన తెగలైన నాగా, కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ANN TOP 10