AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌లో నూతనోత్తేజం

కంది శ్రీనివాసరెడ్డి చేరికతో కార్యకర్తల్లో జోష్‌
వేలాదిగా వచ్చి చేరుతున్న యువత
శ్రీనన్న వెంటే మేమంటూ స్నేహ‘హస్తం’
ప్రజా సేవాభవన్‌ లో అభిమానుల తాకిడి
జోగురామన్నకు ఓటు అడిగే హక్కులేదు: కంది

ఆదిలాబాద్‌: ప్రజా నాయకులు కంది శ్రీనివాస రెడ్డి చేరికతో కాంగ్రెస్‌ పార్టీలో నూతనోత్తేజం కనబడుతోంది. ఆదిలాబాద్‌ లోని ఆయన క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్‌ లో అభిమానుల తాకిడి పెరుగుతోంది. కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరేందుకు యువకులు ఉత్సాహం చూపుతున్నారు. పట్టణంలోని భుక్తాపూర్‌ కాలనీ నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన యువకులు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కంది శ్రీనివాస రెడ్డి పై ఉన్న అభిమానంతో పార్టీలో చేరామని యువకులు చెబుతున్నారు.

పార్టీలో చేరిన అందరికీ స్వాగతం పలికారు కంది శ్రీనివాస రెడ్డి కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్త ఓ అగ్గి బరాటై బీఆర్‌ ఎస్‌ ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ అని అన్నారు. అభివృద్ధి పథకాలు కాంగ్రెస్‌ తోనే సాధ్యమని కంది శ్రీనివాస రెడ్డి తేల్చి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే ఓట్ల కోసం రావాలని అన్నారు. పేదల కు కాంగ్రెస్‌ పార్టీ ఇంటి జాగాలిచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ పేదల పార్టీ అన్నారు.ఎన్ని కేసులు పెట్టించినా కేసులకు భయపడే ప్రసక్తే లేదని కంది శ్రీనివాస రెడ్డి గట్టిగా చెప్పారు. జోగురామన్న కు పాయల్‌ శంకర్‌ కు ఓటేస్తే అది మోరిలో పడ్డట్టే అని విమర్శించారు.కాంగ్రెస్‌ పార్టీది అధ్భుతమైన మేనిఫెస్టో అని కాంగ్రెస్‌ పార్టీ కి ఈసారి ఒక్కసారి అవకాశమివ్వాలని కంది శ్రీనివాస రెడ్డి కోరారు.

ANN TOP 10