జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బతికున్నంత వరకు తానుండేది జనగామ గడ్డమీదనేనని స్పష్టం చేశారు. తన కట్టె కాలేది ఈ గడ్డమీదనేనని, తన చితా భస్మాన్ని నియోజక వర్గంలోని ప్రతి చెరువులో కలపాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కార్యకర్తలను కోరారు. స్థానికేతరుడని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ముత్తిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
సొంత పార్టీకి చెందిన జనగామ నియోజకవర్గ నేతలపై ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అక్కడక్కడా కొండెoగలు, గుంటనక్కలు, చీడ పురుగులు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. వాటి కాళ్లు, చేతులు విరిచేస్తానని స్వయంగా సీఎం చెప్పారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎదుట నీచ రాజకీయాలు సాగవన్నారు. తన పనితీరు బాగుందని సాక్షాత్తు సీఎం చెప్పారన్నారు. ప్రజల మధ్య తిరిగి, ప్రజల పక్షాన నిలబడితేనే ఆదరిస్తారన్నారు.









