AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వీధి కుక్క దాడిలో 15 మందికి గాయాలు

మహబూబాబాద్ జిల్లాలో ఘటన
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో పిచ్చి కుక్క దాడిలో పలువురు గాయపడ్డారు. మండలంలోని ఆనేపురం, వెంకయ్య తండా, మేఘ్య తండాలలో 14 మందితో పాటు రెండు పశువులను పిచ్చి కుక్క కరిచింది. రోడ్లపై వెళ్తున్న వారిపై దాడి చేసి గాయపరుస్తుండటంతో వెంకయ్య తండా సర్పంచ్ సూరా నాయక్‌‌తో పాటు గ్రామస్తులు ఆ కుక్కని చంపేశారు. కుక్క కాటుకు గురైన వారందరూ మరిపెడ పీహెచ్‌‌సీలో వ్యాక్సిన్‌‌ వేయించుకున్నారు. మరో 8 మందిని మెరుగైన చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్‌‌కి తరలించారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో గ్రామాల్లో వీధి కుక్కలు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కనిపించిన వారిని కరుస్తున్నాయని, చిన్న పిల్లలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ కోరారు.

ANN TOP 10