
ఐటీ రంగానికి మహర్దశ రాజీవ్ గాంధీ చలువే
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
ప్రజా సేవా భవన్‌లో
ఆదిలాబాద్: ఎలక్ట్రానిక్ విప్లవానికి ఆధ్యుడు.. గొప్ప దార్శనికుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. భారతదేశంలో ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీకి బీజం వేసిన ఘనత ఆయనదేనని అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్‌నగర్‌లో గల ప్రజా సేవా భవన్‌లో కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్‌గాంధీ 32వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతరత్న రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడని ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. ఈ కుటుంబాన్ని దేశం మరువదని అన్నారు. వారి స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి ఆ మహనీయుడికి అంకితం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్, అల్లూరి అశోక్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కిష్టారెడ్డి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.










