AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

30 మందితో కూడిన కర్ణాటక కేబినెట్‌

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఆయన 30 మందితో కూడిన కేబినెట్‌ను నడిపించనున్నారని సమాచారం. కర్నాటక కాంగ్రెస్‌కు 136 సీట్లు ఉన్నాయి. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ కూడా ప్రమాణస్వీకారం చేశారు.

కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేబినెట్‌కు అభ్యర్థులను ఎంచుకునే అధికారాన్ని సిద్ధరామయ్యకు, శివకుమార్‌కు ఇచ్చింది. వీరు చెరో 10 మంది అభ్యర్థులను కేబినెట్‌కు ఎంపికచేస్తారని సమాచారం. నేడు(శనివారం) కర్నాటక మంత్రుల ప్రమాణస్వీకారం జరుగనున్నది. ఇందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ముఖ్యమంత్రులు, ఓ తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధికి ఆహ్వానం అందిందని సమాచారం. కర్ణాటక కేబినెట్ గరిష్ఠ పరిమితి 34. కాగా సిద్ధరామయ్య, శివకుమారం కలిసి 20 మందిని ఎంపికచేయనున్నారు. మిగతా వాటికి కాంగ్రెస్ నాయకత్వం అభ్యర్థులను ఎంపిక చేసింది. నాలుగు నుంచి ఐదు సీట్లను ఖాళీగా ఉంచింది.

ANN TOP 10